Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
మండల పరిధిలో 108 సిబ్బంది క్లిష్టమైన కాన్పును సుఖ ప్రసవం చేసి తల్లి, బిడ్డను సురక్షితంగా సులానగర్ ప్రాథమిక వైద్యశాలకు సోమవారం తరలించారు. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని వెంకట్యతండాకు చెందిన మోకాల, నీలిమ రాజశేఖర్ రెండవ కన్పు, పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన టేకులపల్లి 108 సిబ్బంది ఈఎంటి సత్యనారాయణ, ఫైలెట్ కెవి రామారావులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తరలిస్తుండగా, మార్గమధ్యంలో పురిటినొప్పులు అధికమవడంతో 108 సిబ్బంది చాకచక్యంగా డెలివరీ ప్రాక్టికల్‌ను అనుసరిస్తూ ఇఆర్సీపీ వైద్యాధికారి నాయక్‌కు ఫోన్ ద్వారా సంప్రదించి సుఖప్రసవం చేశారు. ఆడశిశువు జన్మించినట్టు తెలిపారు. అనంతరం తల్లి, బిడ్డకు ప్రథమ చికిత్స అందస్తూ సులానగర్ ప్రాథమిక వైద్యశాలకు సురక్షితంగా తరలించారు.