Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెంటు, బ్యానర్ తొలగింపు
- కుటుంబ సభ్యులపై తిరుగుబాటు
నవతెలంగాణ-కొత్తగూడెం
తన భూమిని కబ్జాదారులు ఆక్రమించారని...తనకు న్యాయం జరిగే విధంగా అధికారులు చూడాలని వేడుకుంటూ బాధితురాలు సూరమ్మ పాత కొత్తగూడెం ఏరియాలో గత బుధవారం నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. సోమవారం సూరమ్మ దీక్ష వద్దకు కబ్జాదారులు వచ్చి వెంటనే దీక్షలు తొలగించాలని టెంట్ తీసివేయాలని హెచ్చరిస్తూ టెంట్, బ్యానర్‌ను నేల మట్టం చేశారు. కబ్జాదారులు ఇక్కడితో ఆగకుండా సూరమ్మ కుటుంబ సభ్యులపై దూరుసుగా ప్రవర్తించారు. మేము కబ్జా చేసిన స్థలంలో ఇల్లు కట్టుకుంటామని, ఎవరు అడ్డుకుం టారో చూస్తామని బాధితురాలు సూరమ్మ ముందే కబ్జాదారులు హెచ్చరించారు. ఈ సందర్భంగా సూరమ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వం మున్సిపల్ పరిధిలోని పాత కొత్తగూడెంలో తనకు స్థలము కేటాయించిందని ఇట్టి స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు కేటాయించిన భూమిని కబ్జా దారుల ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని దీనిపై రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన సరైన స్పందన లేదని సూరమ్మ ఆవేదన వ్యక్తంచ ేసింది. అధికారులు పట్టించుకోని కారణంగానే దీక్షకు దిగడం జరిగిందని తెలిపారు. ఎట్టి పరిస్థితిలోను భూమిని వదులుకునేది లేదని సూరమ్మ స్పష్టం చేసిం ది. ఇంత జరుగుతునప్పటికీ సంబంధిత అధికారు పట్టించుకోకుండా నిమ్మంకు నీరేత్తినట్లు వ్యవహరిం చడం పలువురుని విస్మయానికి గురిచేస్తుంది.