Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ఆహార భద్రత సంస్థ (ఎఫ్‌సీఐ)ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎత్తివేయాలని చూస్తుందని, ఈ (ఎఫ్‌సిఐ)ని కాపాడుకోవాలని ఏఐకేఎస్ సీసీ పిలుపు మేరకు సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో మండలంలో వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) గోదాం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీ జిల్లా నాయకులు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి (ఎఫ్‌సీఐ)లను ఎత్తివేసే కుట్రలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమరం సీతారాములు, సీపీఐ మండల కార్యదర్శి రమేష్, సీపీఐ(ఎం)మండల కార్యదర్శి జోగ నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు ఈసం పాపారావు, పీవైఎల్ రాష్ట్ర నాయకులు పర్శిక రవి, న్యూడెమోక్రసీ నాయకులు వెంకన్న, నరేష్, బుచ్చన్న, పూనెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లులను ఉపసంహరించుకోవాలని ఎఫ్‌సీఐ కార్యాలయాల వద్ద ఆందోళనలో భాగంగా సోమవారం భారత ఆహార సంస్థలైన గిరిజన సహకార సంఘ కార్యాలయం మేనేజర్‌కు, మార్కెట్‌యార్డ్ అధికారి ఏఐకెఎస్‌సీసీ ఆధ్వర్యంలో నాయకులు అమర్లపూడి రాము, మోరంపూడి శ్రీనివాసరావు, యార్లగడ్డ భాస్కర్‌రావు వినతి ఇచ్చి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దొడ్డ లకిëనారాయణ, నాయుడు, కాక వెంకటేష్, కొర్స ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.