Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని వసతులతో మార్కెట్ సముదాయం నిర్మించాలి
- చిరువ్యాపారుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-కొత్తగూడెం
అభివృద్ధిపేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురిచేసే చర్యలను మానుకోవాలని, వ్యాపారులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలబడతామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా పునరుద్ఘాటించారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ ఆవరణలో సోమవారం జరిగిన కూరగాయలు, పండ్లు, వీధి వ్యాపారుల సమావేశంలో సాబీర్ మాట్లాడారు. నూతన వ్యాపార సముదాయాలను నిర్మానానికి అధికారులు పూనుకోవడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే నిర్మాణాలు జరిగే వరకు వ్యాపారులు నష్టపోకుండా చూడాల్సిన భాద్యత అధికారులదేనన్నారు. నిర్మాణాలు పూర్తయ్యేవరకు అన్ని వసతులతో ప్రత్యామ్నాయ షెడ్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపారానికి అనువుగా 12 చదరపు అడుగుల షెడ్లు నిర్మాణం చేపట్టాలని, ప్రభుత్వమే ఉచితంగా విద్యుత్, నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి వై.శ్రీనివాసరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గెద్దాడి నగేష్, టీఎన్ఎన్ నర్సింహారావు, రాము, అంజద్, రహమాన్, అశోక్, కృష్ణ, ఆసీఫ్, భరత్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.