Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు 2021 సంవత్సరానికి దంతేలబోర ఎస్సీ కాలనీ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ గద్దల రమేష్ అంబేద్కర్ జాతీయ అవార్డు అందుకున్నారు. హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన 4వ తెలంగాణ రాష్ట్రం కాన్ఫరెన్స్లో బహుజన సాహిత్య అకాడమీ బీఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకు పోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతియేటా ప్రజా ఉద్యమ కారులకు, సంఘ సేవలకు, రచయితలకు, కవులకు, కళాకారులకు, ఈ అవార్డు అందజేస్తున్నట్లు తెలియజేశారు. తెలంగాణలోని 31 జిల్లాల నుండి సుమారుగా 200 మంది డెలిగేట్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని తెలియజేశారు.
అవార్డు గ్రహీత గద్దల రమేష్ మాట్లాడుతూ...
దంతేలబోర ఎస్సీ కాలనీ ఒక మారుమూల గ్రామంలో జన్మించిన నాకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు అందుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ అత్యున్నత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును నాకు అందజేసిన బీఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్, గోవర్ధన్, ఐలయ్య లక్ష్మీరాజ్యం, రాథోడ్ విజరు కుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు.