Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కన్న తల్లికి చెప్పినా పట్టించుకోని వైనం
- సొంత అన్నతో సహా... పెద్దమ్మ కుమారుడు,
- ఐదుగురు వ్యక్తులపై నిర్భయ కేసు నమోదు
నవతెలంగాణ-కొత్తగూడెం
మహిళపై జరుగుతున్న లైంగిక దాడిలో సొంత తల్లి, పెద్దమ్మ కూడా ప్రోత్సహించడంతో తోడ పుట్టినోడు, పెద్దమ్మ కుమారుడు ఇరువురు పలు దఫాలుగా లైంగిక దాడికి పాల్పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించడంతో కొత్తగూడెం 2వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతానికి చెందిన లోధ్ మీనా భాయ్ తన భర్త నుండి విడిపోయింది. కూతురు, కుమారుడితో మణుగూరులో ఉంటుంది. బాధితురాలు 2009లో రెండవ తరగతి చదువుతున్న ఏడేండ్ల వయసులోనే తన రక్త సంబంధికుడు అన్న లోధ్ సునీల్ కుమార్ చెల్లిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడడంతో తన కన్నతల్లి మీనా భాయ్ కి పలు దఫాలుగా మొరపెట్టుకుంది. అయినప్పటికీ తల్లి తన కుమారుడు సొంత చెల్లి పై చేస్తున్న అఘాయిత్యాన్ని ప్రోత్సహిస్తూ బాధితురాలిని మందలించేది. బాధితురాలు ఏమీ చేయలేక మణుగూరు ప్రాంతాల్లోనే ఉంటున్న తన పెద్దమ్మ ఇంటికి వెళ్ళేది. తన పెద్ద కుమారుడు సైతం వర్మ, అజయ్ కుమార్ సైతం తనపై లైంగిక దాడికి ఒడిగట్టాడని బాధితురాలు పోలీసులతో వాపోయింది. గత కొన్నేండ్లుగా జరుగుతున్న ఈ అకృత్యాన్ని బాధితురాలు హైదరాబాదులో ఉన్నత చదువులు చదువుకుంటూ తన స్నేహితులకు, మిత్రులకు తన బాధను వెల్లడించింది. దీంతో వారి ప్రోత్సాహం, సహకారంతో మంగళవారం కొత్తగూడెం, రామవరం 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి సోదరుడు, నిందితుడు సునీల్ కుమార్ సింగరేణి సంస్థలో ఇటీవలే ఉద్యోగం సాధించి, మణుగూరు నుండి రామవరం ప్రాంతానికి వచ్చారు. దీంతో టూ టౌన్ పోలీసులు సునీల్ కుమార్, పెద్దమ్మ కుమారుడు వర్మ, అజయ్ కుమార్, కన్నతల్లి మీనా భాయ్, పెద్దమ్మ వర్మ రాజకుమారి, పెద్దనాన్న వర్మ రాజేష్లపై నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.