Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ఎర్రుపాలెం
మోటార్ సైకిల్ వాహన దారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి మాత్రమే మోటార్ సైకిల్ పై ప్రయాణం చేయాలని వైరా ఏసిపి కే సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది తలకు దెబ్బ తగలడం కారణంతోనే మరణిస్తున్నారని, అటువంటి రోడ్డు ప్రమాదాలలో మరణాలు సంభవించ కుండా ఉండాలంటే హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులు తో మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ రోడ్లపై జాగ్రత్తతో ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలను నడపాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మధిర సిఐఓ మురళీ, స్థానిక ఎస్సై టి ఉదరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.