Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల అప్రమత్తంగా వుండాలి
- సింగరేణి వైద్యులు డాక్టర్ గంటయ్య
నవతెలంగాణ-మణుగూరు
కరోనా మ్యూటేషన్లోకి మార్చుకోని తీవ్రంగా ప్రజలపై దాటి చేస్తున్నదని మణుగూరు సింగరేణి ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ బంక గంటయ్య అన్నారు. మంగళ వారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ... వో గ్రూఫ్ రక్తం వున్న వారికి కరోనా వైరస్ తీవ్రత తక్కువగా వుంటుందని దీని వలన గుండేకు ఎలాంటి జబ్బులు రావన్నారు. ఇతర రక్త గ్రూఫులు వున్నవారికి దీని ప్రభావ తీవ్రత అధికంగా వుంటుందని, వైరస్ తీవ్రత తగ్గించడం కోసం యాంటిబాడీస్ పవర్ పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కో వ్యాక్సిన్, కోవి సీల్డ్ టీకాలను ప్రజలు వేయించుకోవాలన్నారు. వీటిపై ఎలాంటి ఆపోహలు లేకుండా ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
130 కోట్ల జనాభాలో కేవలం 20లక్షల మందికే టీకా అందించడం జరిగిందన్నారు. టీకా వేయించుకోవడంలో ప్రజలు ముందు రావాలని, వ్యాక్సిన్ వలన భయందోళన అవసరం లేదన్నారు. వైరస్ నివారణకు అందరూ మాస్క్‌లు ధరించి, శానిటైజర్స్‌ను వాడాలన్నారు. ప్రతి రెండు గంటల ఒక్కసారి, బయటికి వెళ్లి వచ్చినప్పుడు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుకోవాలన్నారు. సేక్ హ్యాండ్ ఇవ్వకుండా, నమస్కారం పెట్టినట్లు అయితే వైరస్ తీవ్రతను తగ్గించవచ్చు అన్నారు.