Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ ఎస్పీ శబరీష్
నవతెలంగాణ-పినపాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, కరకగూడెం, అశ్వాపురం మండలాల పరిధిలో ఇసుక కాంట్రా క్టర్లు, వ్యాపారస్తుల వద్ద నుంచి మావో యిస్టుల పేరుతో నగదు వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను ఏడూళ్ల బయ్యారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక నకిలీ మావోయిస్టు లెటర్ ప్యాడ్, రూ.10 వేల నగదు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఏఎస్పీ శబరీష్ పేర్కొన్నారు. వారి వివరాల ప్రకారం.... పినపాక మండలం జానంపేట, పాండురంగ పురం శివారు లో సర్కిల్ ఇన్స్పెక్టర్ దోమల రమేష్, సబ్ ఇన్స్పెక్టర్ టీవి.ఆర్.సూరి, ఏడూళ్ల బయ్యా రం పోలీసులు మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్రవా హనంపై వెళుతున్న వ్యక్తులను ఆపి ప్రశ్నించామని.. వారు పొంతన లేని సమాధా నాలు చెప్పడంతో తనిఖీ చేయగా భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు సీపీఐ (ఎం) కార్యదర్శి జగన్ పేరుతో లెటర్ ప్యాడ్ కనిపించడంతో గట్టిగా ప్రశ్నించగా పూర్తి వివరాలు లభించాయని సీఐ రమేష్ తెలిపారు. దర్యాప్తులో డొమెడ గ్రామానికి చెందిన బోడా వెంకటేష్, పినపాక మండలం తోగూడెం గ్రామానికి చెందిన అక్కపల్లి కార్తీక్, మంగపేట మండలం శనగ కుంట గ్రామానికి చెందిన ఇర్ప కిరణ్, పినపాక దుగినే పల్లికి చెందిన నవీన్ అనే నలుగురు ముఠాగా ఏర్పడి మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడినట్లు అంగీకరించారని తెలిపారు. మూడు నెలల కాలంలో రూ.60 వేల నగదు వసూలు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే పోలీసులు వెంటనే తెలియజెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఈ బయ్యారం సీఐ రమేష్, ఎస్ఐ టివిఆర్ సూరి, పోలీస్ శాఖ సిబ్బందిని అభినందించారు.