Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏను ముట్టడించిన ఆదివాసీలు
నవతెలంగాణ-భద్రాచలం
1/70 చట్టాన్ని పటిష్టంఆ అమలు చేయాలని భద్రాచలం ఐటీడీఏను మంగళవారం ఆదివాసీలు ముట్టడించారు. ఆదివాసీలు పెద్ద ఎత్తున సుమారు రెండు వేల మంది ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఐటీడీఏ వరకు ఈ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని చుంచుపల్లి రెవెన్యూ గ్రామంలోని 137/1లోని వందలాది ఎకరాలను ప్రభుత్వ భూములను ఆదివాసీ, పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఏజెన్సీలో గిరిజనేతరుల అక్రమ పట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీ ఐటీడీఏ వరకు సాగింది. ఐకాస కన్వీనర్ వాసం రామకృష్ణ దొర, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కొమురం బుచ్చయ్య సారధ్యంలో ఐటీడీఏ పీవోకు వినతి పత్రం అందజేశారు. అక్రమ పట్టాలను రద్దు చేసి అర్హులైన అధివాసీలకు ఇండ్ల స్థలాలు ఇస్తామని పీవో హామీని ఇచ్చారు. ఐటీడీఏ వద్ద భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ అడ్వైజర్ పొడుగు శ్రీనాథ్, జివ్వాజి యశోద, కంగాల జగన్, పద్ధము భుజంగరావు, వాసం అంజిబాబు, వీరన్న, పాయం లక్ష్మీనర్సు, వరుస నర్సింహారావు, రమాదేవి, కాంతమ్మ, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.