Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్
నవతెలంగాణ-కొత్తగూడెం
స్వచ్చమైన, ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని నిర్మిద్దామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్ అన్నారు. బుధవారం ప్రపంచ ఆరోగ్యదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడారు. స్వచ్ఛమైన ఆరోగ్యమైన ప్రపంచాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్య కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించి, మాస్కులు తప్పని సరిగా ధరించాలని, చేతులు తరుచూ శుభ్రం చేసుకోవాలని, సమూహాలకు, మీటింగ్కు దూరంగా ఉండాలని సూచించారు. కోవిడ్-19 నిబంధనలు పాటించాలని, 45 సంవత్సరాలు పైబడిని ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని, తద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. వ్యాక్సినేషన్ తరువాత కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. మంచి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.