Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకున్న జనం
- 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్న ఈఈ
- గంటపాటు కొనసాగిన ఆందోళన
నవతెలంగాణ-అశ్వాపురం
రోడ్డు నిర్మాణ పనుల జాప్యాన్ని నిరసిస్తూ బటీల గుంపు పంచాయతీ ప్రజలు మంగళవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. సుమారు రెండు వందల మందితో సర్వసభ్య సమావేశం జరుగుతున్న వద్దకు వచ్చి నిరసనను వ్యక్తం చేసారు. వివరాలలోకి వెళితే మండల పరిధిలోని మిట్టగూడెం ఆర్అండ్బీ ప్రధాన రహదారి దగ్గరి నుండి పాములపల్లి మీదుగా కుమ్మరిగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణంకు ప్రభుత్వం 2018-19 ఎస్డీఎఫ్ నిధులనుండి రూ.7.50 కోట్ల నిధులను మంజూరిచేసింది. పనులు చేపట్టేందుకు మంత్రి పువ్వాడ అజరుకుమార్ రోడ్డు పనులకు శంఖుస్థాపనలు చేసారు. కొంతమేరకు పనులు చేపట్టిన సదరు కాంట్రాక్టర్ అకస్మికంగా పనులు చేపట్టకుండా గత ఏడాదిన్నర కాలంగా జాప్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ ఏడాదైన రోడ్డు పనులు ప్రారంభిస్తే సుఖంగా ప్రయాణం సాగించాలన్న ప్రజల ఆశలు నేరవేరేలా కనిపించకపోవడంతో ఆ పంచాయతీలోని ప్రజలు ఆగ్రహించారు. సర్పంచ్ బట్టా సత్యనారాయణను వెంటబెట్టుకుని వచ్చారు. సర్వసభ్య సమావేశంలో సర్పంచ్, ఎంపీటీటీ కొర్సా ముత్తయ్య సభలో కింద కూర్చుని నిరసన వ్యక్తం చేసారు. తమ పంచాయతీకి రోడ్డు నిర్మాన్ని వెంటనే చేపట్టాలని పట్టుబట్టారు. దీంతో ఎంపీపీ ముత్తినేని సుజాత, జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ ఆర్అండ్బి ఈఈతో ఫోన్లో మాట్లాడారు. వీలైనంత త్వరలో పనులు చేపట్టాలని కోరారు. పదిహేను రోజుల్లో పనులు మొదలు పెడతామని తెలపడంతో ఆందోళను విరమించారు.