Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
బుగ్గ గ్రామంలో సొంతింటి స్థలం వున్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని వున్న ఇండ్ల పీకి, చదును చేసుకోవాలని ఐటీడీఏ అధికారులు గ్రామస్తులకు హామి ఇచ్చారు. ఆది వాసీయులు వున్న ఇండ్లను పీకి చదు ను చేసుకున్న తరువాత నెలల గడుస్తు న్నా అధికారులు అడ్రస్ లేకుండా పోయారు. దీంతో ఆదివాసీయులు పందిర్ల కింద, చెట్లు కింద జీవనం కొనసాగిస్తున్నారని, వెంటనే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించి ఇవ్వాలని పగిడేరు ఎంపీటీసీ కుంజా క్రిష్ణకుమారి అన్నారు. చెరువుముందు సింగారం ఎంపీటీసీ పాయం ప్రమీల కూడా కుంజా క్రిష్ణకుమారికి సపోర్టు చేస్తూ పక్క మండలాల్లో సొంత ఇంటి స్థలం వున్నవారికి ఇండ్లు కట్టిస్తుంటే మన మండలంలో దీనికి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కారం విజయకుమారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రధానంగా 14 గ్రామపంచాయతీల్లో మంచినీటి సమస్య తీవ్రంగా వుందని సర్పంచ్‌లందరూ ఏక కఠంతో నిల దిశారు. అనంతరం పాయం ప్రమిల మాట్లాడుతూ... అశ్వాపురం మండ లంలో మల్లేలమడుగు, చింతిర్యాల గ్రామాల్లో స్వంత ఇంటి స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కటిస్తు న్నారని మన మండలంలో కూడా స్వంత ఇంటి స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రామానుజవరం సర్పంచ్ బాడిస సతీష్ మాట్లాడు తూ... మంచినీటి సమస్యతో పాటు నిర్వాసిత గ్రామాలైన అయోధ్యనగర్, కొత్తపల్లి గ్రామాలోని ప్రజల రేషన్ కార్డులు మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో వున్నయని వెంటనే వాటికి పరిష్కార మార్గం చూపాలని అన్నారు. విప్పల సింగారం, చెరువు ముందు సింగారం గ్రామాల ప్రజలు రేషన్ బియ్యం కోసం సమితిసింగారం రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విప్పల సింగారం గ్రామంలో రేషన్ షాప్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం డాక్టర్ మౌనిక మాట్లాడుతూ...
కరోనాను నివారించేందుకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. పగిడేరు సర్పంచ్ తాటి సావిత్రి మాట్లా డుతూ... 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు కంటి చూపు సరిగ్గా లేక, సెల్ ఫోన్లో ఓటీపీ రాని కారణంగా రేషన్ బియ్యం ఇవ్వడం లేదన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ నర్సింహారావు, ఎంపీడీవో వీరబాబు, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపివో పల్నాటి వెంకటే శ్వర్లు తదితరులు పాల్గొన్నారు.