Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం రామాలయ ఆలయ ఈఓ శివాజీ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కోవిడ్ 19 రెండవ దశ కరోనా కేసులు పెరుగుతున్న నేపద్యంలో ఈ నెల 21న జరిగే పర్ణశాల రాములోరి కళ్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు భద్రా చలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయ ఈఓ శివాజీ తెలిపారు. మంగళవారం పర్ణశాల రామాలయ ఆవరణలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కళ్యాణాన్ని ప్రతి నెల ఆలయ ఆవరణలో నిర్వహించే పునర్వసు కళ్యాణ ప్రదేశంలో నిర్వహించాలని ఆలయ సిబ్బందికి సూచించారు. దీంతో పాటు కళ్యాణాన్ని కొద్ది మంది అధికారుల సమక్షంలో నిర్వహించాలన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్లో ఉండడంతో పాటు మాస్క్ ధరించిన వారికి మాత్రమే దర్శనానికి అనుమతించాలన్నారు. గ్రామ పంచాయితీ ఆద్వర్యంలో ప్రత్యేక పారిశుద్య పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, ఏఇఓ భవాని రామకృష్ణ, డిఇ రవీంద్ర, సూపరిండెంట్ నిరంజన్, సాయిబాబు, సిసి అనిల్, పంచాయితీ శాఖ కు చెందిన అధికారులు పాల్గొన్నారు.