Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వసభ్య సమావేశంలో సభ్యుల తీర్మానం
నవతెలంగాణ-అశ్వాపురం
మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో మంగళవారం సాదారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత సభలో గడిసిన మూడు నెలలో కాలంలో చేపట్టిన ప్రగతి నివేదికలను ఆయా శాఖల అధికారులు నివేదించారు. అదేవిధంగా గడవబోవు మూడు మాసాలకు సంబందించిన అభివృద్ధి అంశాలపై చర్చచేపట్టారు. ప్రధానంగా మండల పరిధిలోని కుమ్మరిగూడెం పంచాయతీ నుండి మొండికుంట పంచాయతీ వరకు సీతారామ ప్రాజెక్టు విస్తరించి ఉంది. ప్రాజెక్టు ద్వారా వెలికితీసిన మట్టి, రాయిని ప్రభుత్వం ఇతర ప్రాంతాలలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనులకు తరలిస్తుంది. ఇలా తరలిపోయిన మట్టికి, రాయి చెల్లిస్తున్న సీనరేజ్ నుండి పంచాయతీలకు రావాల్సిన వాట రాకపోవడంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని, ప్రభుత్వం ప్రతీ పంచాయతీకి ఇవ్వాల్సిన రాయాల్టి చెల్లించాలని సభలో సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మాణించారు. అదేవిధంగా పోడుసాగుదారులపై దాడులు నిలిపివేసి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ గోపిరెడ్డి, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, ఎంపిడిఓ రవింద్రప్రసాద్, సర్పంచ్లు, ఎంపిటీసీలు, అధికారులు పాల్గొన్నారు.