Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మందకొడిగా వ్యాక్షినేషన్
- విస్తరిస్తున్న కోవిడ్-19
- ఈ ఏడాదిలో నేటికి నమోదైనవి 28 కేసులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
కరోనా పూర్తిగా మటుమాయం కాకపోయినా ప్రజల్లో మొదట్లో దానిపై ఉన్నంత భయం నేడు లేక పోవడంతో చాపకింద నీరులా కోవిడ్-19 విస్తరి స్తుంది. గతేడాది ఈ మూడు నెలల కాలంలో మండలలో ఒక్క కేసు నమోదు కాలేదు. కానీ ఈ ఏడాది ఈ మూడు నెలల కాలంలో నేటి వరకు 28 కేసులు నమోదు అయ్యాయి. జనవరి-04, ఫిబ్రవరి-00, మార్చి-15, ఏప్రిల్-09, మొత్తం-28 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నివారణా కోసం చేసిన ప్రచారంలో 10 శాతం కూడా ప్రచారం చేయక పోవడంతో వ్యాక్సినేషన్ నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. అంతే కాకుండా కోవిన్ యాప్‌లో నమోదు చేసుకోవాలని కేంద్రప్ర భుత్వం నిబంధన సైతం ఈ మందకొడి వ్యాక్షినేన్కు కారణం అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు మండలంలోని రెండు ప్రభుత్వ ప్రాధమిక వైద్యశాలలు పరిధిలో మొత్తం 1176 మంది మాత్రమే వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఇందులో ప్రింట్ లైన్ వర్కర్స్ 532 మంది కాగా 644 మంది మాత్రమే 45 నుండి 60 ఏండ్లు పైబడిన సాధారణ పౌరులు వ్యాక్సినేషన్ చేయించుకున్నారు.
ఆసుపత్రి ప్రింట్ లైన్ వర్కర్స్ 45 - 60 పై
అశ్వారావుపేట 426 604
గుమ్మడవల్లి 106 40
వాస్తవానికి పీహెచ్సీలలో మార్చి 06 ప్రారంభం అయిన వ్యాక్సినేషన్లో 45-60 పైబడిన వారికి రోజుకీ 100 మందికి వ్యాక్సిన్ చేయాలి. పీహెచ్సీలో ఏప్రిల్ 01 ప్రారంభం అయిన వ్యాక్సినేషన్లో రోజుకి 50 మందికి లక్ష్యంగా వ్యాక్సిన్ చేయాలి కానీ ఆ మేరలో వ్యాక్సినేషన్ జరగడం లేదని ఈ గణాంకాలను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం వ్యాక్సిన్ చేయించుకున్న వారు కూడా కాస్తో కూస్తో చదువుకున్న కుటుంబాలు వారు, సామాజిక హౌదాలో ఉన్న వారు, ఉద్యోగ కుటుం బాలు వారే నని అర్ధం అవుతుంది. ఇప్పటికైనా విస్తృత ప్రచారం నిర్వహించి, పల్లె ప్రాంతాల్లో ప్రత్యేక అవగా హన కార్యక్రమాలు ద్వారా వ్యాక్సినేషన్‌పై సామాన్యుల్లో ఉన్న అపోహలను తొలగించి ప్రతీ ఒక్కరికీ వ్యాక్సినేషన్ అందేలా చూడాలని ప్రజానీకం కోరుతుంది.
ప్రచారం నిర్వహిస్తున్నాం : డాక్టర్ హరీష్, పీహెచ్సీ గుమ్మడవల్లి
వైద్యారోగ్య సిబ్బంది ద్వారా వ్యాక్సినేషన్‌పై ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నాం. కరోనా నివారణ నియమాలు పాటించేలా అవగాహన కల్పి స్తున్నాం. ప్రజల్లో స్వీయ చైత న్యంతోనే మార్పు అనివార్యం.