Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంపులో నూతనంగా ప్రారంభించిన అధునాతన బస్టాండ్ పైకప్పుకు అప్పుడే చిల్లులు పడ్డాయి. ప్లాట్ ఫారంల వద్ద ప్రయాణికులు కూర్చొనే స్థలంలో పై నుంచి వర్షం చినుకులు పడుతుండగా, కొన్ని ప్లాట్ ఫారంల ఎదురుగా ఉన్న దుకాణాల గోడలపై నీరు చెమ్మగా దిగింది. రూ. 25 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన బస్టాండ్ చిన్న వర్షపు జల్లుకే కురుస్తుండటంపై ప్రయాణికులు విస్మయానికి గురయ్యారు.కొద్దిపాటి వర్షానికే బస్టాండ్ కురవడం పట్ల ఖమ్మం ఆర్ఎం సోలెమన్ ను వివరణ కోరగా ఇంకా చిన్నచిన్న పనులు కొనసాగుతున్నాయని, అనుకోకుండా వచ్చిన ఈ వర్షంతో సమస్య ఎదురైందన్నారు. ఆ పనులు పూర్తయితే సమస్య ఉండదని ఆర్ఎం తెలిపారు.