Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
సోమవారం రాత్రి వచ్చిన గాలివాన బీభత్సంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి పంటనష్టాన్ని అంచనా వేసి నివేదిక పంపాలని వ్యవసాయశాఖ అధికారులను ఎంఎల్ఏ కందాల ఉపేందర్‌రెడ్డి ఆదేశించారు. మండలంలో ఎంఎల్ఏ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. రైతుల పంటపొలాలను, కూలిపోయిన ఇండ్లను, విరిగిపోయిన విద్యుత్ స్తంభాలను, ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. కూలిపోయిన ఇళ్లను పరిశీలించి పూర్తిగా దెబ్బతిన్న బాధితులకు ఐదు వేల రూపాయల చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న బాధితులకు మూడు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. రెవెన్యూ అధికారులు గ్రామాలలో పర్యటించి గ్రామాల వారిగా బాధితుల లిస్టు తయారు చేయాలని సూచించారు. గాలి బీభత్సానికి విరిగిన కరెంట్ స్తంభాలను, పడిపోయిన ట్రాన్స్ఫార్మర్లను వెంటనే ఏర్పాటు చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ రామ సహాయం బాలకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చాట్ల పరుశురాం, సొసైటీ చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ సెట్రాం నాయక్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామ్ కుమార్, గోపె.రాము, పల్లెబోయిన శ్రీనివాస్, శీలం రవి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటల నష్టపరిహారాన్ని అంచనా వేయాలని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని కొండాపురం, సీతారాంపురం, చింతపల్లి, అరేకొడు, అరేకొడు తండా గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జలగంనగర్ లోని ఎంపిడిఓ కార్యాలయంలో పంట నష్టాల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షాలకు ఏయే పంటలకు ఎంత నష్టం వాటిల్లింది. ఏయే గ్రామాల్లో ఆ తీవ్రత ఉందో పరిశీలించాలన్నారు.మొక్కజొన్న పంటకు ఎక్కువ నష్టం వాటిల్లినట్లు అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మొక్కజొన్న, వరి, మిర్చి ఇతర పంటలకు జరిగిన నష్టాన్ని పరిశీలించి నివేదిక తయారు చేయాలన్నారు.గ్రామాల్లో విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించాలి అధికారులకు తెలిపారు. అరేకొడు తండాలో స్మశాన వాటిక పైకప్పు లేచిపోయిందని వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాలలో తిరిగి పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం గోపాల్, పిఎసిఎస్ చైర్మన్ ఏనుగు ధర్మారెడ్డి, తాసిల్దార్ కారుమంచి శ్రీనివాసరావు, ఎంపీడీవో బి.శ్రీనివాసరావు, ఎంపీవో శాస్త్రి, ఆర్ఐ నరేష్, ఏఈఓ లు తదితరులు పాల్గొన్నారు.