Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడి అరెస్ట్
- క్షుద్ర పూజల నేపథ్యంలో మైనర్ బాలిక లొంగదీత
- వంద రోజుల అనంతరం కేసును ఛేదించిన పోలీసులు
నవతెలంగాణ-ఎర్రుపాలెం
క్షుద్ర పూజల పేరుతో గుప్త నిధులు సంపాధించాలనే అత్యాశతో డిసెంబర్ నెల 17వ తారీఖున మైనర్ బాలిక కిడ్నాప్ జరిగి రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి పాఠకులకు విదితమే. ఎర్రుపాలెం మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామానికి చెందిన మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు మరసకట్ల సూర్యప్రకాశ్ శర్మను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వైరా ఏసీపీ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు గతేడాది డిసెంబర్ 17న ఎరుపాలెం పోలీస్ స్టేషన్లో బాలిక అదశ్యమైనట్లు తల్లి రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడంతో అప్పటినుండి పోలీసులు ఆ బాలిక ఆచూకీ కోసం ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వెతికి సాంకేతికపరమైన నిందితుని సెల్ ఫోన్ సిగల్ ఆధారంగా సదరు వ్యక్తిని వెతికేందుకు ఎర్రుపాలెం పోలీసులు తీవ్రంగా కృషి చేశారని తెలిపారు. ద్వారకా తిరుమలలో బాలిక సదరు వ్యక్తితో దర్శనానికి వెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌లో కనిపించడంతో క్షుద్ర పూజలలో ఆమె మరణించలేదని పోలీసులు భావించారు. దానితో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు బాలిక కిడ్నాప్‌కు సహకరించిన డ్రైవర్ ఆదినారాయణను, బాలిక మేనమామ నరసింహారావు, రోశమ్మ, నాగేశ్వరరావు, పూజారి శివయ్య, జమలాపురం గ్రామానికి చెందిన మరో పూజారి రఘురామకృష్ణలను విచారించడంతో... పూజ నిమిత్తం తవ్విన గుంతలో ఎటువంటి గుప్తనిధులు దొరకకపోవడంతో పోలీసుల ఆధ్వర్యంలో గుంతను పూడ్చి ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. బాలిక ఆచూకీ కనుగొని బాలికను మార్చి 30న తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. సదరు బాలికను నిందితుడైన సూర్యప్రకాశ్ శర్మ బాలిక పేరుతో పూజలు నిర్వహించాలని తెలపడంతో కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఆమెను ఒంటరిగా కూర్చోపెట్టి పూజలు చేసే నేపథ్యంలో లోబరుచుకున్నాడు అని బాలిక తెలిపినట్లు ఏసీబీ స్థానిక విలేకరులతో తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేపట్టడంతో సదరు వ్యక్తి తప్పించుకొని తిరుగుతూ ఉండగా అనుకోని సందర్భంలో ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు తిరుగుతూ కనిపించడంతో ఎర్రుపాలెం పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిపై ఫోక్స్ చట్టం 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసిపి సత్యనారాయణ తెలిపారు. 30వ తేదీ నుండి మహిళా ఎస్సై సహకారంతో బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించామని, పరీక్షల అనంతరం ఆమెను తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఎస్ఐ ఉదరు కిరణ్ కేసు విషయంలో చొరవ తీసుకొని బాలిక ఆచూకి కనుగొన్న అందుకు ఆయనకు రివార్డు ప్రకటించారు. కిడ్నాప్‌కు సహకరించిన ఎనిమిది మందిని త్వరలో రిమాండ్‌కు పంపనున్నట్లు ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. సమావేశంలో మధిర సిఐ మురళి స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు