Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం నగరంలో ఈ నెల 9న వైఎస్ షర్మిలమ్మ సంకల్ప సభ నిర్వహించి తీరుతామని కొండా రాఘవరెడ్డి తెలిపారు. మంగళవారం ఖమ్మంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో సభ నిర్వహణకు తమకు ఏ విధమైన అనుమతులు ఇచ్చారో వాటి ప్రకారం కోవిడ్ నిబంధనలకు లోబడి బహిరంగ సభ ఉంటుందన్నారు. గత 50 రోజులుగా రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఖమ్మం జిల్లా మినహా తొమ్మిది జిల్లాల వైఎస్సార్ ఆభిమానులతో లోటస్ పాండ్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగిందన్నారు. సమావేశాలకు వచ్చిన వారంతా ఆయా జిల్లాలో స్థానికంగా ఉన్న సమస్యలను, ఇబ్బందులను వివరించారన్నారు. పోడు భూముల సమస్య, ముస్లీం మైనార్టీల రిజర్వేషన్, నిరుద్యోగం, రైతుల ఇబ్బందులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాతో నిర్వహించాల్సిన ఆత్మీయ సమ్మేళనం ఖమ్మంలోనే అభిమానులను కలిసి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారన్నారు. రెండు రోజులుగా జిల్లాలలో తిరుగుతున్న తమకు ప్రజల నుండి మంచి స్పందన ఎదురవుతుందని, రాష్ట్రంలో వైఎస్సార్ సంక్షేమ పాలన కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతుందని, ఏ వర్గానికి సంక్షేమ ఫలాలు అందడం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, ఆరోగ్యశ్రీ, 108, 104 పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు.
మంత్రులు వేలాది మందితో సభలు నిర్వహించినా మాట్లాడలేదని, సాగర్లో ఎన్నికల ప్రచారంలో అర్థం లేకుండా నే పాల్గొంటున్న అడు చెప్పడం లేదని, ఖమ్మంలో సభ నిర్వహిస్తామంటే కోడ్ గుర్తుకు వస్తుందాని, ఎవరికి. ఇవ్వవాని నోటీసులు తమకేందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సంకల్ప సభ జిల్లా ఇన్చార్జి గున్న నాగిరెడ్డి, లక్కినేనీ సుధీర్ బాబు, నర్సిరెడ్డి, భూమి రెడ్డి, ప్రతిభ రెడ్డి, బండారు అంజను రాజు, కృష్ణమోహన్, భీష్మ రవీందర్, జగదీశ్వర్ గుప్త, అప్పం కిషన్, శాంత కుమార్, శీలం వెంకట రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పాల్గొన్నారు.