Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్టంలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ- కల్లూరు
రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని లింగాల గ్రామంలో రాష్ట్రంలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సొసైటీ అధ్యక్షులు పాలెపు రామారావు అధ్యక్షతన సభ జరిగింది. సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల సాధక బాధకాలు తెలుసుకుని వారికి అండగా నిలబడి వారి సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేస్తే చాలు, ఎగుమతి తో సంబంధం లేకుండా, 10 రోజుల్లో వారి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. అనంతరం డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు ప్రసంగించారు. కార్యక్రమంలో అధికారులు జాయింట్ కలెక్టర్ మధుసూదన్‌రావు, ఆర్డీఓ సిహెచ్. సూర్యనారాయణ, ఎసిపి వెంకటేష్, తహసీల్దార్ మంగిలాల్, ఎస్ఐ రఫీ, ఎంపీడీఓ మహాలక్ష్మి, ఎఓ రూప, సర్పంచ్ దేవరపల్లి అరుణ, ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్, చెన్నూరు సొసైటీ అధ్యక్షుడు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు, రైతు సమితి జిల్లా, మండల ప్రతినిధులు పసుమర్తి చంద్రరావు, డా,, లక్కినేని రఘు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, నాయకులు దేవరపల్లి భాస్కరరావు, నాగప్రసాద్, ఎఎంసి వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, సొసైటీ చైర్మన్లు నర్వనేని అంజయ్య, కీసర వెంకటేశ్వరరెడ్డి, చావా వెంకటేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు బాణోత్ జాన్సీ కృష్ణ, దేవరపల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు వేము కృష్ణ, పి.రామకృష్ణ, బీరవల్లి పురుషోత్తం, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.