Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ- ముదిగొండ
ఉద్యోగ, ఉపాధ్యాయలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ సంతృప్తికరంగా లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు అన్నారు. ముదిగొండ పిహెచ్సిలో ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది సమావేశం సోమవారం జరిగింది.ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం ఏడు సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందిందని ఆయన విమర్శించారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని ఇంతవరకు చేయలేదన్నారు. కెసిఆర్ ఫోటో కి పాలాభిషేకం చేయడం కాదు ఉద్యోగస్తులకు అండగా ఉండి ఉద్యమాలు నిర్వహించిన నాయకులకు పాలాభిషేకం చేయాలని ఆయన అన్నారు. ఉద్యమాల ద్వారానే హక్కులను సాధించుకోవాలన్నారు. ఉద్యోగస్తులకు పిఆర్సి 30 శాతం కాకుండా 55 శాతం ఇవ్వాలన్నారు. ఆశా వర్కర్లకు కూడా పిఆర్సి వర్తింప చేసేవిధంగా జీవో చేయాలన్నారు. సమావేశంలో సిఐటియు మండల కన్వీనర్ టిఎస్ కళ్యాణ్, సిపిఐ(ఎం) జిల్లా నాయకులు బండి రమేష్, బండి పద్మ, పార్టీ మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్, నాయకులు రాయల వెంకటేశ్వర్లు, కందుల భాస్కరరావు, కొల్లేటి ఉపేందర్, చిరుమర్రి ఎంపీటీసీ సభ్యురాలు కొల్లేటి అరుణ, సిఐటియు నాయకులు కాసాని వీరయ్య తదితరులు పాల్గొన్నారు.