Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సారపాక : ఉరేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని సారపాకలోని ముత్యాలమ్మ గుడి సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్ కు చెందిన అరుణ(30) కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురం గ్రామానికి చెందిన నాయుడు రాజాతో గత కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకుంది. వత్తిరీత్యా వారు సారపాకలోని ముత్యాలమ్మ గుడి సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అరుణ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మతురాలికి కుమార్తె అను, కుమారుడు రోహిత్ ఉన్నారు. ఇదిలా ఉండగా అరుణ మతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.