Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారేపల్లి : సూర్యతండలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను కారేపల్లి పోలీసులు పట్టుకున్నారు. సూర్యాతండలో గుట్కాలు అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ పీ.సురేష్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా బాదావత్ లక్ష్మన్ ఇంట్లో రూ.3600 విలువ గల గుట్కా, అంబర్ ప్యాకెట్లు లభ్యమైనాయి. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పీ. సురేష్ తెలిపారు.