Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో ఓ వ్యక్తిని మోసం చేసి ఆన్లైన్లో డబ్బులు వసూలు చేసిన సంఘటనపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. పోలేపల్లి పంచాయతీ పరిధిలో గల ఊటవాగు తండాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ తేజవత్ శ్రీనుకు 2020 డిసెంబర్ 23న వాట్సాప్‌లో కౌన్ బనేగా కరోడ్‌పతి అడ్వర్టైజ్మెంట్ బ్రోచర్‌ను గుర్తు తెలియని వ్యక్తి పంపించాడు. రూపాయలు 15,500 చెల్లిస్తే 25 లక్షలు నగదు, 41 లక్షల విలువగల కారును గెలుచుకోవచ్చని వాట్స్ అప్ కాల్, వీడియో కాల్ చేసి అవతలి వ్యక్తులు నమ్మబలికారు. దీంతో శ్రీను వారి మాటలు నమ్మి చెప్పినట్లుగానే 15,500 తర్వాత 20,000 ఇలా కొంత డబ్బులు మొత్తం మూడు లక్షల వరకు ఆన్లైన్లో బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. చివరకు తాను మోసపోయానని తెలుసుకొని బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ వారికి అప్పగించినట్లు రూరల్ ఎస్ఐ బాణాల రాము తెలిపారు.