Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
కరోనా వ్యాధి నియంత్రణ చర్యలు అమలులో కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ, మండల, పట్టణాల్లో వార్డు సభ్యులు, కౌన్సిలర్లు సహాకారంతో 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇప్పించు విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా మహామ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోతూ భయాందోళనలు కలిగిస్తున్నదని, వ్యాధి మన వరకు రాదనుకునే ఇప్పటి వరకు ప్రజలు అలసత్వం, అజాగ్రత్త వహించారని, కానీ నేడు ఆ మహామ్మారి మన ఇంటికే చేరుతుందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని హెచ్చరించారు. వ్యాధి తీవ్రత తగ్గిందని ఎవరికి వారు నిర్ధారణ చేసుకుని ఫంక్షన్లుకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని, కానీ అక్కడే వ్యాధి ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ప్రతి రోజు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 375, భద్రాచలం ఆసుపత్రిలో 250, కమ్యూనిటి హెల్త్ సెంటర్లులో 250, పట్టణ, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో 125 మందికి వ్యాక్సిన్ వేయాలని టార్గెట్ నిర్దేశించినట్లు చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రయాణాలకు యంత్రణ పాటించాలని చెప్పారు. వ్యాధి గురించి ఏమైనా సలహాలు సందేహాల కొరకు 08744246655 కంట్రోల్ రూము నెంబరుకు ఫోన్ చేసి సలహాలు సూచనలు పొందాలని ఆయన తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వ్యాధి నియంత్రణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి సిబ్బందికి అవగాహన కల్పించాలని, కార్యాలయాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన సమాచారపు వివరాలు ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు.