Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అంకిరెడ్డి నర్సింహారావు అన్నారు. బుధవారం టీఎస్ ట్రాన్స్కో, జెన్కో డిస్కంలలో దీర్ఘకాలిక సమస్యలు ఈపిఎఫ్ నుండి జిపిఎఫ్ ఇవ్వాలని ఆర్టీజన్లకు ఏపిఎస్ఈబి రూల్స్ వర్తింపజేయాలని 20 ప్రధాన డిమాండ్లతో పరిష్కారానికి ఈనెల 19న హైదరాబాద్లో టిఎస్ జెన్కో ట్రీన్స్కో డిస్కంల చైర్మెన్లకు సమ్మె నోటీస్ ఇచ్చిన అనుబంధంగా పాల్వంచలో జెన్కో ట్రాన్స్కో డిస్కంలలో సమ్మె నోటీస్ ఇచ్చామని తెలిపారు. తప్పనిసరి పరిస్థితులలో నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పత్తెం వెంకటేశ్వర్లు , నేతగాని రాజు, త్రినాథ్, తుమ్మల వెంకటేశ్వర్లు, సత్యం, కన్నయ్య, దామెర సత్యం, జి నాగరాజు, సాయికిరణ్, తదితరులు పాల్గొన్నారు.