Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్యాధికారి డాక్టర్ భాస్కర్
నవతెలంగాణ-కొత్తగూడెం
కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని జిల్లా వైద్యా ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ భాస్కర్ వైద్యసిబ్బందిని కోరారు. బుధవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్చమైన ఆరోగ్యమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు అందరం అప్రమత్తమై కోవిడ్-19 కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించాలని కోరారు. వ్యాధి నియంత్రణకు 45 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు ప్రజలు తప్పని సరిగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పోటు వినోద్‌కుమార్, జిల్లా పబ్లిక్ హెల్త్ నర్సు ఆఫీసర్ అధికారి అన్నా మేరీ, ఎన్సీడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, జిల్లా మాస్ మీడియా అధికారి ఎండి ఫైజ్యొయినుద్దిన్, హెల్త్ ఎడ్యూకేటర్ టి. విజరుకుమార్, డిపిఎంఓ మోహన్, రాంప్రసాద్ పాల్గొన్నారు.