Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
ఆటో, మోటర్ సైకిల్ ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడిన ఘటన కారేపల్లి ఎంపీడీవో ఆఫీస్ వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. తన ఆటో ను ఆదెర్ల ఏసుబాబు ఎంపీడీవో ఆఫీస్ దగ్గర ఉన్న ఆటో మెకానిక్ షెడ్డు నుంచి రోడ్డు పైకి తీసుకువస్తున్న సమయంలో కారేపల్లి నుంచి పెట్రోల్ బంకు కు వెళుతున్న మోటర్ సైకిల్ అతి వేగంగా వచ్చి ఆటోని ఢీ కొట్టింది. ఈప్రమాదంలో ఆటో పల్టీలు కొట్టింది. ఈఘటనలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న గుర్రాల సాయి, బద్దే సన్నీ, ఆటో డ్రైవర్ ఏసుబాబు (సాంబ) కు గాయాలు అయ్యాయి. వీరిని స్థానికులు కారేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. మెరుగైన వైద్యం కోసం వీరిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసు చేరుకుని ప్రమాదానికి కారణమైన వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.