Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురితో కూడిన కేంద్ర బృందం పర్యటన
- రోగులకు అందిస్తున్న సేవలు, కల్పిస్తున్న వసతులు తనిఖీ
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం పెద్దాసుపత్రి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. రెండు దపాలు అవార్డు గెలుచుకుని సరిలేరు తనకెవ్యరు ఆంటూ అగ్రభాగాన నిలిచింది తాజాగా మరోసారి తన రికార్డును తానే బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుత 2018 ,2020 సంవత్సరానికిగాను జాతీయ స్థాయిలో నిర్వహించే కాయకల్ప రేసులో ముందడుగు వేసింది దీనిలో భాగంగా బుధవారం కేంద్ర బందం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పర్యటించింది. ఉదయం నుంచి రాత్రి వరకు నలుగురితో కూడిన టీం ఆన్ని విభాగాలను పరిశీలించింది హాస్పిటల్లో రోగులకు అందిస్తున్న వైద్య సేవలతోపాటు, వారికి కల్పిస్తున్న వసతుల అంశమై అణువణువూ తనిఖీలు నిర్వహించింది. ప్రధానంగా జాతీయ ఆరోగ్య మిషన్ రూపొందించిన నియమావళి మేరకు ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, ఇన్ఫెక్షన్ కంట్రోల్, హైజీన్ ప్రమోషన్, సపోర్ట్ సర్వీసెస్ విభాగాలను అధ్యయనం చేసి మార్కులు కేటాయించింది. ఈక్రమంలోనే పలు విభాగాల్లో మెరుగైన పనితీరు కనబర్పాలని సలహాలు, సూచనలు చేసింది. మొత్తం మీద పెద్దాసుపత్రి యంత్రాంగం తీరు, రోగులకు వసతుల పట్ల సంతప్తిని వ్యక్తం చేసింది.ఈ కార్యక్రమంలో కాయకల్పా బృందానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ బొన్సువాడ మెడికల్ సూపరింటెండెంట్, డాక్టర్ రామకష్ణ ప్రోగ్రాం అఫీసర్ ఎన్హెచ్ఎం హైదరాబాద్, శ్రీనివాసరావు అసిసైటంట్ ప్రొగ్రాం ఆఫీసర్ ఆశా, రాజ్యలక్ష్మి స్టాఫ్ నర్స్ గజ్వేల్, ఖమ్మం హాస్పిటల్ మెడికల్ సూపరింటెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వరులు, ఆర్ఎం డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, నర్సింగ్ సూపరింటెండెంట్స్ సుగుణ, రాజరాజేశ్వరి, చంద్ర భగీరథ, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ కపా ఉషశ్రీ, డైటీషియన్ మేరీ, పాలనా అధికారి అర్పీఎస్ సాగర్, నందగిరి శ్రీను, పారిశుద్ధ్య విభాగానికి చెందిన పుల్లయ్య, క్వాలిటీ మేనేజ్మెంట్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నార