Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రఘునాధపాలెం
మండల పరిధి వెంకటాయపాలెం గ్రామ సమీపంలో వైరా రోడ్డుపై ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ట్రాన్స్ ఫోర్స్ అధికారులు, మరియు రఘునాధపాలెం ఎస్సై తన సిబ్బందితో కలిసి ఉదయం 9 గంటల నుండి వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు 10 గంటల సమయంలో తనికెళ్ళ వైపు నుండి ఖమ్మం వైపు వస్తున్న కారును ఆపి వారిని ప్రశ్నించగా అనుమానాస్పద సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి కారు తనిఖీ చేయగా కారులో సుమారు 30 లక్షల విలువగల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం కారులో ఉన్న డ్రైవర్లు భూక్యా కుమార్, గోళ్ల భాను ప్రసాద్ లను, విచారించగా, పెద్ద గూడూరు గ్రామానికి చెందిన బోడా వాలా, మరియు సారపాక గ్రామానికి చెందిన ఇద్దరు,కొండపల్లి రవితేజ,బొజ్జ వంశీ , అను వారు ముగ్గురు కలిసి అక్రమంగా గంజాయిని గట్టు చప్పుడు కాకుండా డొంకరాయి నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నామని పోలీసులకు తెలిపారు. ముగ్గురు ముద్దాయి దగ్గర నుండి ఒక కారు తో పాటు, 97 ప్యాకెట్ల గంజాయి, 194 కేజీలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయిని స్వాధీనపరచుకొని ముద్దాయిలను రిమాండ్ కు తరలిస్తున్నట్లు రఘునాధపాలెం ఎస్ ఐ వరాల శ్రీనివాస్ తెలిపారు.