Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి పోలీస్, మండల వైద్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం సత్తుపల్లిలో కోవిడ్-19 అవగాహన ర్యాలీని నిర్వహించారు. పట్టణ సీఐ ఎ.రమాకాంత్, మండల వైద్యాధికారి చింతా కిరణ్కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో పట్టణంలోని ప్రధాన రహదారిపై జరిగింది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్ వాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఐ రమాకాంత్, వైద్యాధికారి కిరణ్కుమార్ మాట్లాడారు. ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి తప్పని సరిగా మాస్కు ధరించాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపధ్యంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదం మన పక్కనే పొంచి ఉందనే విషయాన్ని విస్మరించరాదన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, మున్సిపల్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.