Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రఘునాధపాలెం
మండలం పరిధి వేప కుంట్ల గ్రామంలో వర్షాధార ప్రాంత అభివృద్ధి ఆర్ఏడి పథకంలో భాగంగా గ్రామ సర్పంచ్ దారా శ్యాంసుందర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. సమావేశంలో మండల వ్యవసాయ అధికారి భాస్కర్ రావు మాట్లాడుతూ ఈ పథకం యొక్క విధి విధానాలు, అమలు, లబ్ధిదారుల యొక్క భాగస్వామ్యం, క్లస్టర్ ప్రెసిడెంట్ ఎన్నిక గురించి వివరించారు. అనంతరం ఖమ్మం డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనివాస రావు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ... రైతుల కు ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతులు సమీకృత వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పంటతో పాటు పశుపోషణ కూడా ముఖ్యమని తెలిపారు. అందుకే ఈ పథకంలో పాడి గేదెలను మరియు గొర్లను రాయితీపై రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. పశువైద్యాధికారి డాక్టర్ క్రాంతి కుమార్ పాడి గేదెలను కొనేటప్పుడు పాటించవ లసిన నియమాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి, సందీప్ కుమార్, ఉప్పెర్ల కొండల్ రావు, గుగ్గిళ్ళ కోటేశ్వరీ గ్రామపంచాయతీ సెక్రెటరీ, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు సోదరులు పాల్గొన్నారు