Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
కరోనా కోరల దెబ్బకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మూసివేయడంతో విద్యార్థులు మామిడి కోతకు దారి పట్టారు. పాఠశాలలు, కళాశాలలు లేవు. మండుతున్న ఎండలకు ఇళ్ల వద్ద ఉండలేక పోతున్నాము చేసేది ఏమీ లేక చెట్ల మధ్యలో చల్లటి గాలులు మధ్య హాయిగా పని చేసుకోవచ్చు తమ ఖర్చులకు ఆదాయం వస్తుందని, అందుకోసమే మామిడి కోతకు వెళ్తున్నామని విద్యార్థులు అంటున్నారు. మండల పరిధిలోని చిరునోముల గ్రామం జిల్లాలోని మామిడి తోటలకు ప్రసిద్ధి గాంచింది. ఈ గ్రామంలోనే సుమారు వెయ్యి ఎకరాల వరకూ మామిడి తోటలు ఉన్నాయి. సుమారు 30 సంవత్సరాల నుంచి చిరునోముల గ్రామం నుంచి భారీ ఎత్తున పూణే , హైదరాబాద్ ,బెంగళూర్ వంటి ప్రాంతాలకు మామిడి కాయలు ఎగుమతి చేస్తూ వస్తున్నారు. గత ఏడాది ఈ సంవత్సరం ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా మామిడి కాయ ఎగుమతి జరుగుతుంది. హైదరాబాదుకు చెందిన బడా వ్యాపారులు సైతం చిరునోముల గ్రామంలో మామిడితోటలో కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది వ్యాపారులు చిరునోముల గ్రామానికి చెందిన వారికి పెట్టుబడులు పెడుతున్నారు. సుమారు రెండు నెలల పాటు మామిడి కాయ కోతలు ఉంటాయి. గత సంవత్సరం ఈ ఏడాది మామిడి కోత సమయంలో కరోనా వ్యాధి ప్రబలటంతో పరిస్థితులు తారుమారయ్యాయి. రోజువారీ పని చేసే కూలీలు మామిడి కోత కోయ లేని పరిస్థితి ఏర్పడటంతో విద్యార్థులు రంగంలోకి దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులు వేలకు వేలు ఖర్చుపెట్టి తమ పిల్లలను విద్యకు పంపిస్తున్నారు. కరోనా కారణంగా విద్యార్థులు ఇంటివద్దే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత కాలంలో విద్యార్థుల ఆహారపు అలవాట్లు ఆచారాలు సెల్ ఫోన్లు అవసరాలు విలువైన దుస్తుల అలంకరణ ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో విద్యార్థులు కూడా వాటి కోసం తపించి పోతున్నారు. ఇంటి వద్ద ఉన్న విద్యార్థులకు తల్లిదండ్రులు వారికి అవసరమైన విధంగా నగదు ఇవ్వటం లేదు. దీంతో విద్యార్థులు పని ఒత్తిడి తక్కువగా ఉండటం శ్రమశక్తి కూడా భారంగా లేకపోవడంతో చిరునోముల కు చెందిన విద్యార్థులందరూ మామిడి కోత దారి పట్టారు. చిరునోములలో సుమారు 200 మంది విద్యార్థులు ప్రతిరోజు మామిడి కోత కి వెళ్తున్నారు. ప్రతి రోజు వేతనం ఒక్కొక్కరికి ఐదు వందలు రూపాయలు వస్తున్నాయి. దీంతో వారి వ్యక్తిగత ఖర్చులు తల్లిదండ్రులపై ఆధారపడకుండా వెళ్లి పోతున్నాయని విద్యార్థులు అంటున్నారు. పెద్దవారు అయితే మామిడికాయ కోయలేకపోతున్నారని దీని ఫలితంగా మామిడి కోత బాగా ఆలస్యం అవుతుందని మామిడి తోటల వ్యాపారులు అంటున్నారు. విద్యార్థులైతే బలంగా ఉంటారని యువ రక్తంతో ఉండటం వలన త్వరితగతిన మామిడికాయలు వేగంగా కోస్తున్నారు అని అందువల్ల విద్యార్థులను ఎక్కువగా మామిడి కాయ కోతకు తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు. వేసవికాలంలో మామిడి కోత వలన రెండు నెలల వ్యవధిలో 25 వేల నుంచి 30 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందని మామిడి కోత టీం లీడర్ ముంగి శివరాం తెలిపాడు. పగలు పని చేసిన దానికంటే అదనంగా పని చేస్తే దానికి కూడా అదనంగా వేతనం మామిడికాయ వ్యాపారులు ఇస్తున్నారని సావిటి సాయి, గోళ్ళ హేమంత్, తెల్లబోయిన పరశురాం, తెల్లబోయిన వివేక్, వరుగు అశోక్, ఇమ్మడి లోకేష్ తెల్లబోయిన సురేష్ మోడల్, వరుగు నారాయణ, ముంగి రాజేష్, తెల్లబోయిన వెంకటేష్ తెలిపారు. తమ వ్యక్తిగత ఖర్చులతో పాటు తమ చదువుకు కూడా ఈ డబ్బులు ఎంత ఉపయోగపడు తున్నాయని విద్యార్థులు అంటున్నారు.