Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండల పరిధిలో ఖానాపురం పంచాయతీలో నూతన పంచాయతీ కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మండలంలోని అతిచిన్న గ్రామపంచాయతీ ఖానాపురం అభివృద్ధిలో ఆదర్శం. ఖానాపురం గ్రామానికి సొంత పంచాయతీ కార్యాలయం లేకపోవటంతో అద్దె భవనంలో పంచాయతీ కార్యాలయం చాలా ఇబ్బందిగా ఉండటంతో ఆగ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వచ్చిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు దృష్టికి గ్రామంలో పంచాయతీ కార్యాలయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామసర్పంచ్ మాలోజి ఉష తీసుకెళ్లడంతో యుద్ధ ప్రాతిపదిక మీద పరిశీలించి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ వెంటనే పంచాయతీరాజ్ శాఖ నుండి రూ 20 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నేలకొండపల్లి మండలానికి చెందిన ఓ కాంట్రాక్టర్ టెండరు ఖరారు చేసుకొని రెండు నెలల వరకు పనులు ప్రారంభించక పోవటంతో నూతన పంచాయతీ భవన నిర్మాణ పనుల జాప్యంపై నవతెలంగాణ దినపత్రికలో 'పంచాయతీ కార్యాలయం భవన నిర్మాణ పనులు ప్రారంభం ఎప్పుడు'' అనే వార్తాకథనాన్ని ప్రచురించిన విషయం విదితమే. ఈ వార్తకు స్పందించిన పంచాయతీరాజ్ అధికారులు ఖానాపురం పంచాయతీలో నూతన భవన నిర్మాణ పనులను కాంట్రాక్టర్ తో ప్రారంభం చేయించారు. ప్రస్తుతం పంచాయతీ కార్యాలయం భవన నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి.