Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి సైకిల్‌పై పర్యటించారు. జడ్పీ సెంటర్, తుమ్మలగడ్డ, బోనకల్ క్రాస్ రోడ్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, జహీర్ పురా, శ్రీనివాస్ నగర్, కిన్నెరసాని థియేటర్ రోడ్, హర్కర్ బావి సెంటర్, పీఎస్ఆర్ రోడ్, గుంటి మల్లన్న దేవాలయం రోడ్, కాల్వఒడ్డు జూబ్లీపురా, మయూరి సెంటర్, బస్ డిపో రోడ్, సరితా క్లినిక్ సెంటర్, గట్టయ్య సెంటర్, నూతన మున్సిపల్ భవనం వరకు రోడ్డుకు ఇరు వైపులా జరుగుతున్న సైడు కాల్వ పనులు, రోడ్డు విస్తరణ పనులు, విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ అంతర్గత పైప్ లైన్ పనులు పారిశుధ్యం పనులను పరిశీలించారు. పనుల ఆలస్యం పట్ల మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి పనులు కొనసాగింపు కుదరదని, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రజా రవాణాకు, ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు. వారి వెంట మున్సిపల్, విద్యుత్, పబ్లిక్ హెల్త్, రెవిన్యూ తదితర శాఖ అధికారులు ఉన్నారు.