Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరాటౌన్
భారత రైతాంగ జీవన పరిస్థితి దేశ నాగరికతగా వెలిసిన దేశంలో రైతు ఉనికికి ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అన్నారు. బుధవారం ఢల్లీ, గాజీపూర్ సరిహద్దు రైతు ఉద్యమ కేంద్రంలో మట్టి సత్యాగ్రహం సందర్భంగా జరిగిన సభలో బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పోరేట్ కంపెనీల వ్యవసాయాన్ని అభివద్ధి చేయడానికని అన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశంలో , ఆర్థిక, రాజకీయ ఆధిపత్యం చెపట్టక ముందు భారతదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యం పొందటం జరిగిందని అన్నారు. భారతదేశ నూలు వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి ఉందని, పట్టువస్త్రాలు, ముడిపట్టు, బియ్యం, గోధుమలు, చెక్కెర, నీలిమందు ఎగుమతి అయ్యేవని అన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారత వాణిజ్య, వ్యవసాయంను తన బ్రిటిష్ కంపెనీలకు ముడిపదార్థాలు సరఫరా చేసే విధంగా దిగజార్చిందని అన్నారు, కాంట్రాక్టు సాగుపద్దతిలో నీలిమందు సాగు చేయించటం జరిగిందని, దీనిపై బెంగాల్, బీహార్ రాష్ట్రాలల నీలిమందు రైతు ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. చంపారన్ రైతాంగ పోరాట సత్యాగ్రహం కూడా జమీందార్లు, ఐరోపా ప్లాంటర్స్ అఘాయిత్యాలు, దోపిడీలను తట్టుకోలేక రైతులు ఉద్యమం చేశారని అన్నారు. కంపెనీల వ్యవసాయం అంటే కనీస హక్కులు లేకుండా బానిసలా 16 గంటల పని చేయాలని ఉపాధి భద్రతా లేకుండా, సరైన తిండి లభించని పరిస్థితి వస్తుందని అన్నారు. రైతుల సమస్యలను దేశ సమస్యలుగా భావించి పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చింతనిప్పు చలపతిరావు, రిటైర్డ్ సైనిక అసోసియేషన్ అధ్యక్షులు రాజుకూమార్, జైపి శర్మ, రైతు ఉద్యమ నాయకులు చౌదరి గూలీవీర్ సింగ్ పాల్గొన్నారు.