Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం నగరపాలక సంస్థ, సిద్దిపేట, నకేరేకల్, అచ్చంపేట్ జడ్చర్ల, కొత్తూర్ మున్సిపాలిటీలకు సాధారణ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు మరికొన్ని మున్సిపలిటీలలో ఏర్పడ్డ ఖాళీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిందని, ఇందుకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రచురణ మరియు పోలింగ్ కేంద్రాల గుర్తింపుకు నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందని, ఎన్నికల నిర్వహణ పూర్తి అయ్యేవరకు ప్రతి అంశంలో అవసరమైన ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి. పార్ధసారధి అన్నారు. బుధవారం సంబంధిత జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థల), మున్సిపల్ కమిషనర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మొదలైందన్నారు. ఏప్రిల్ 11వ తేదీన తుది ఓటరు జాబితా వార్డు వారీగా ప్రచురించాలన్నారు పోలింగ్ స్టేషన్ల గుర్తింపుకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని, వీలైనంతవరకు గతంలో ఉపయోగించిన పోలింగ్ స్టేషన్లనే వాడుకునేలా చూడాలని, ఏప్రిల్ 14వ తేదీన పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ప్రచురించాలన్నారు. ఈ సమావేశానికి కమిషనర్ మరియు డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, సంబధిత జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్సలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, తదితరులు పాల్గొన్నారు.