Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవ తెలంగాణ-మధిర
మధిరలో ప్రైవేట్ టీచర్ అసోసియేషన్, అఖిలపక్షం ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నుండి ర్యాలీ ప్రదర్శన నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని, తక్షణమే కరోనా భృతిని ప్రకటించాలని, వెంటనే పాఠశాలలు, కళాశాలలు తెరవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు బెజవాడ రవి బాబు, రామాంజనేయులు, సిపిఎం నాయకులు శీలం నరసింహారావు, టిడిపి నాయకులు మల్లాది హనుమంతరావు మార్నిడి పుల్లారావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన చావా వేణుబాబు దారా బాలరాజు, కర్నాటి రామారావు పాల్గొన్నారు.