Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీటింగ్ కేసు నమోదు..కోర్టుకు రిమాండ్
నవతెలంగాణ-పెనుబల్లి
ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని పెనుబల్లి పోలీసులు అరెస్టు చేశారు. సిఐ కరుణాకర్, ఎస్సై తోట నాగరాజలు బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన అంకిరెడ్డి నరేష్ కుమార్ రెడ్డి సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా అనేకమంది యువత తల్లిదండ్రుల వద్ద మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అందినకాడికి వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి ల్యాప్ టాప్, సెల్ ఫోన్, పాస్‌పోర్టులను సీజ్ చేశామని సిఐ తెలిపారు. కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న నరేష్ రెడ్డిని తమిళనాడులోని తిరుచనాపల్లి ఎయిర్పోర్ట్ వద్ద సింగపూర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పెనుబల్లి ఎస్ఐ తోట నాగరాజు తన సిబ్బందితో నాలుగు రోజులు పాటు శ్రమించి అతని కస్టడీలోకి తీసుకుని కోర్టుకు రిమాండ్ చేశామన్నారు. ఇతనిపై కల్లూరు మండలం పోలీస్ స్టేషన్ లో కూడా చీటింగ్ కేసు నమోదైందని తెలిపారు.