Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేసీకి నిర్వాసితుల వినతి
నవతెలంగాణ-అశ్వాపురం
గోదావరి నదిపై ప్రభుత్వం నిర్మించేందుకు తలపెట్టిన సీతమ్మసాగర్ ప్రాజెక్టు ద్వారా భూములు కోల్పోతున్న నిర్వసిత రైతులందరికీ మెరుగైన ప్యాకేజిని ఇవ్వాలని జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ, సీఐటీయూ నాయకులు గద్దల శ్రీనివాసరావు, రైతులు బుధవారం జేసి వెంకటేశ్వర్లుకు వినతి పత్రాన్ని అందజేసారు. అమ్మగారిపల్లి పాఠశాల ఆవరణంలో నిర్వసిత రైతులతో ఏర్పాటు చేసిన సభలో రైతులు ఆయనకు వారి సమస్యలను విన్నవించుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము రెండు పంటలను పండే భూములను దారాదత్తం చేస్తున్నట్లు తెలిపారు. ఎకరానికి రూ. 50 లక్షలతోపాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజిని ఇవ్వాలన్నారు. అదేవిధంగా భూములు కోల్పోయిన రైతులకు కుటుంబాలలోని వారికి ప్రాజెక్టులో ఉపాది కల్పించాలన్నారు. అనంతరం జడ్పీటీసీ జేసీతో రైతులకు సంబందించిన పలు అంశాలను మాట్లాడారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు. అనంతరం బట్టీలగుంపు పంచాయతీని సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వి. సురేష్‌కుమార్, అమ్మగారిపల్లి సర్పంచ్ పాయం భద్రయ్య, రైతులు నేలపట్ల రమణారెడ్డి, గాదే కేశవరెడ్డి, నర్సింహచారి, గాదే వెంకటరెడ్డి, దాసరి నాగేశ్వరరావు, రవిందర్‌రెడ్డి పాల్గొన్నారు.