Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెన్కో యాజమాన్యం తుంగలో తొక్కిన పరిశ్రమల చట్టం
- సీఎస్ఆర్ అమలులో నిధుల ఉల్లంఘన
- గ్రీన్ ఎర్త్ సొసైటీ వ్యవస్థాపకులు రమేశ్‌రాథోడ్
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్రంలోనే భారీ విద్యుత్ కేంద్రంగా ఉన్న పాల్వంచలో పొల్యూషన్ మాపై వదిలి సీఎస్ఆర్ నిధులను ఇతర ప్రాంతాలకు తరలిస్తారా అని గ్రీన్ ఎర్త్ సొసైటీ వ్యవస్థాపకులు రమేశ్ రాథోడ్ ప్రశ్నించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పరిశ్రమల వల్ల ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక నష్టాలతోపాటు ప్రాణనష్టంతో కుటుంబాలు కుటుంబాలే రోడ్డున పడుతుంటే ఈ సంక్షేమం కోసం మౌలిక సదుపాయాల కోసం జెన్కో యాజమాన్యం పరిశ్రమల చట్ట ప్రకారం సీఎస్ఆర్ నిధులను ఖర్చు చేయాల్సింది పోయి ఇతర ప్రాంతాల్లో ఖర్చు పెట్టడం ఏంటని ఇది ముమ్మాటికీ నిబంధనల ఉల్లంఘనే అని అన్నారు. కేటిపిఎస్ యాజమాన్యం పూర్తిగా చట్టాన్ని తుంగలో తొక్కిందని అన్నారు. కేటిపిఎస్కు ఆనుకుని ఉన్న మూడు దత్తత పంచాయితీలు సూరారం, సోములగూడెం, పాండురంగాపురంతోపాటు సిఎంఎస్ఆర్ ప్రభావిత గ్రామాలు 23 ఉన్నాయని వీటి సంక్షేమం కోసం పరిశ్రమల చట్టం ప్రకారం ఏడవ దశ నిర్మాణం నాటికే 22.16 కోట్లు కేటిపిఎస్ పాతప్లాంట్కు సంబంధించి సుమారు 5 కోట్లు వెరసి 27.16 కోట్లు ఎకో సెన్సిటీవ్ జోన్ కిన్నెరసానికి 32 కోట్లు, ఈఎంపి జీవ సమతుల్యతకు 28.6కోట్లు ఇప్పటికే ఖర్చు చేయాల్సి ఉండగా 2021 నాటికి కేవలం 9.9 కోట్లతో సుమారు 5 కోట్ల వరకు చట్టవిరుద్ధంగా ఇతర ప్రాంతాలకు నిధులు కేటాయించడం ఇక్కడి ప్రజల చేతగానితనమే అని అన్నారు. వాస్తవంగా సిఎస్ఆర్ చట్టప్రకారం కాలుష్య ప్రభావిత గ్రామాలకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటిది కూసుమంచి మండలం నాయకన్‌గూడెం మహబూబాబాద్ జగ్గయ్యతండా, కొత్తగూడెం, పాత కొత్తగూడెం తదితర ప్రాంతాలకు సుమారు 4 కోట్ల 4కోట్ల 68 లక్షలు చట్టవిరుద్ధంగా నిధులు కేటాయించారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సిఎస్ఆర్ పాలసీ నిధులన్నీ కాలుష్య ప్రభావితప్రాంతాలకే ఖర్చు చేయాలని లేని పక్షంలో చట్టరీత్యా చర్యలకు పూనుకోవాల్సి వస్తుందని ప్రజలతో కలిసి ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ఈ సమావేశంలో గ్రీన్‌ఎర్త్ సొసైటీ అద్యక్షులు బాలినేని సత్యనారాయణ, దాసరి కిరణ్‌కుమార్, రచ్చ శ్రీను, మదార్‌సాహెబ్, కల్తి ప్రసాద్, అన్వర్, వాసు తదితరులు పాల్గొన్నారు.