Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ ప్రభుత్వం రైతు క్షేమం కోసం పనిచేస్తుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే వనమా చుంచుపల్లి మండలం ప్రశాంత్ నగర్లో నిర్మించిన రైతువేదిక, కొత్తగూడెం మున్సిపల్ పరిధి 5వ వార్డు గంగ హుస్సేన్ బస్తీలో నిర్మించిన రైతు వేదికలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ముఖ్య మంత్రి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు దేశంలో ఏ రాష్ట్రంలో లేదని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలని, రైతు ఆర్ధికంగా ఎదగాలని కోరారు. రైతువేదికలను రైతులు అన్ని విధాలుగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను దశలవారీగా నెరవేరుస్తున్నామని తెలిపారు. పట్టణాలు, పల్లెల్లను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. రూ.100 కోట్లతో కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకుడు వనమా రాఘవేంద్ర రావు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, డైరెక్టర్ కరుణాకర్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వ్యవసాయ శాఖ ఏడి, పంచాయతీరాజ్ ఏఈ, తదితరులు పాల్గొన్నారు.