Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో పారిశ్రామికవాడలో తేజా హైవిల్డ్ క్రికెట్ కోచింగ్ అకాడమీని ఐటీసీ కాంట్రాక్టర్లు పాకాల దుర్గా ప్రసాద్, వెంకట్రావులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలంలోని క్రికెట్ కోచింగ్‌ను యువ ఔత్సాహిక క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉమ్మడి జిల్లాలోనే తొలిసారిగా యువ క్రికెటర్లు బ్యాటింగ్ చేసే సమయంలో బౌలింగ్ మిషన్ ను సైతం ఇక్కడ వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కోన ఆనంద్ కుమార్ శర్మ , హైదరాబాద్ కు చెందిన హైవిల్స్ లైన్స క్రికెట్ క్లబ్ చైర్మన్ జె.శ్రీనివాస్, టీసీఏ జిల్లా అధ్యక్షులు మునికేశవ్, జిల్లా కార్యదర్శి ఆనంద్ పాల్ , చైర్మన్ కుప్పాల నాగరాజు, భూక్య బాల్య, భద్రాచలం సీనియర్, యువ క్రికెటర్లు పాల్గొన్నారు.