Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ను క్యాంప్ కార్యాలయంలో ఏరియా జియం పి.వి.సత్యనారాయణ బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్ప గుచ్చం అందించారు. ఈ సందర్భంగా సింగరేణి అద్భుత ప్రగతి అనే పుస్తకాన్ని అందజేసారు. సింగరేణి సాధించిన అభివృద్ధి, సంస్థ చేపట్టిన సంస్కరణలు, ప్రగతి పనులను జియం వివరించారు. ఈ సందర్భంగా హరిప్రియ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం లోనే కాదు దేశంలోనే ఉత్తమ కంపెనీగా సింగరేణి సంస్థ నిలిచిందని ఇది ఇలాగే కొనసాగించాలని మంచి అభివృద్ధి చెందాలన్నారు. చేసిన అభివద్ధి పనులపై ఇలాంటి పుస్తకాన్ని ప్రచురించి అందరికి వివరాలను తెలియజేస్తునందులకు సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో యస్వోటు జియం బండి వెంకటయ్య, కేఒసి ప్రాజెక్ట్ అధికారి మల్లారపు మల్లయ్య, ఎస్టేట్ అధికారి తౌరియ నాయక్ పాల్గొన్నారు.