Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబ్ కలెక్టర్, కలెక్టర్ల పేరుతో బెదిరింపులు
- రామక్రిష్ణ, నవీన్‌ల మాయలో మున్సిపల్ కమిషనర్
- మున్సిపల్ కార్యాలయం ముట్టడించిన కాంట్రాక్ట్ కార్మికులు
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మున్సిపల్ కమిషనర్ పి.నాగప్రసాద్ జవాన్లు, వాటర్ వర్క్సు ఇనెస్పెక్టర్లపై నోటి దురుసు మాటలు మానుకోవాలని కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు. బుధవారం 20 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ....మున్సిపల్ కార్మికులను మనుషుల చూడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారన్నారు. నేను 1 గ్రేడ్ అధికారిని, నాతో మాట్లాడే అర్హత మీకు లేదని కోపంతో తిడుతున్నారన్నారు. తమకు ఐదు నెలల నుండి జీతాలు రాక కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీతాలు గురించి అడితే బదిలీపై వెళ్లిన కమిషనర్‌ను అడుకోండి అని.. లేదా బ్యాంక్ మేనేజర్ వద్ద తీసుకోండి అని మండ్డిపడుతున్నారన్నారు. కమిషనర్ ఇష్టానుశారంగా మాట్లాడుతూ మీరు పర్మినెంట్ ఉద్యోగులు కారని, కాంట్రాక్ట్ కార్మికుల మాత్రమే అని మిమ్మల్నిందర్ని తీసివేస్తానని బెదిరిస్తున్నాడన్నారు. మున్సిపల్ పరిధిలో 120 మంది చేసే పనిని 20 కార్మికులు మాత్రమే చేస్తున్నారని, ఆ 20 కార్మికులు ఉదయం 4 గంటల నుండి రాత్రి 8గంటల వరకు పనిచేస్తునే వుండాలని వాపోయ్యారు. ఒక ఏ గ్రేట్ 1 అధికారి కార్యాలయ గదిలో మున్సిపాలిటీకి సంబంధం లేదని రామక్రిష్ణ, డ్రైవర్ నవీన్‌తో గంటల కోద్ది మాట్లాడుతూ తమపై విరుచుకుపడుతున్నారు. వారికి మున్సిపాలిటీకి సంబంధం ఏంటిని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు చెప్పుకుందామని వెళ్లిన వారిపై నోటికి వచ్చిన బుతులు తిడుతున్నారన్నారు. మనస్తాపానికి గురైన వర్కు ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మానసికంగా ఇబ్బంది పడి విధులకు రావడం లేదన్నారు. గతంలో ఒక కాంట్రాక్ట్ కార్మికుడు కమిషనర్ చర్యల కారణంగా పెట్రోల్ పోసుకోని నిప్పుంటించుకోవడానికి సిద్ధపడగా కార్మికులు అడ్డుకోవడం జరిగిందన్నారు. మున్సిపల్ కమిషనర్ తమ సమస్య పరిష్కరించాలని, ఐదు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని కార్మికులతో సక్యతగా వుంటు పనులు చేయించుకోవాలని లేనిచో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని కార్మికులు తెలిపారు.