Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉరివేసుకుని బలవర్మరణం
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ కేసు నిందితుడు అజరుకుమార్(26) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. చెల్లిపై తన సోదరులు గత 13 ఏండ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న సంఘటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. తన సోదరుడు సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడంలో వారి కుటుంబం కొత్తగూడెం రామవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రీ ఇంక్లైయిన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. బాధితురాలు మంగళవారం స్థానిక పోలీసులను ఆశ్రయించి తనపై తన సోదరుడు, పెద్దమ్మ కుమారుడు గత కొన్నెళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు అన్నయ్యలు లోధ్ సుశీల్ కుమార్, పెద్దమ్మ కుమారుడు వర్మ అజరు కుమార్లపై, వారికి సహకరించిన తల్లి లోథ్ మీనా బారు, పెద్దమ్మ వర్మ రాజకుమారి, పెద్దనాన్నా వర్మ రాజేష్లపై నిర్భయ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా కేసులో ఏ-2గా కేసు నమోదు అయిన వర్మ అజరుకుమార్ ఇంక్లైయిన్లోని వారింట్లో బుధవారం తెల్లవారు జామున ఉరి వేసుకుని బలవ్మరణానికి పాల్పడ్డారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 2టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిర్భయ కేసు నమోదు అయిన నిందితుడు ఆకస్మాత్తుగా ఉరివేసుకుని మృతి చెందడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
దుండగులను కఠినంగా శిక్షించాలి.....ఐద్వా
సొంత చెల్లిపై లైంగికదాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఐద్వా పట్టణ కార్యదర్శి సందకూరి లక్ష్మి ప్రభుత్వాన్ని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులు పెరిగిపోయాయని, ఇంటి సమయంలో ఇంటి వారే రక్షణ కల్పించాల్సిన సోదరులు బాధిత యువతిపై మృగాళ్లా లైంగిక దాడికి పాల్పడడం దారుణం అన్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.