Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరాలో శుక్రవారం నుండి రాయల మీనా కుమారి మెమోరియల్ షటిల్ టోర్నమెంట్ తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల పోటీలు వైరాలోని ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. షటిల్ పోటీలను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించనున్నారు. అతిథిలుగా తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బోర్రా రాజశేఖర్,మున్సిపల్ చైర్మన్ జైపాల్ హాజరవుతున్నారు, షటిల్ క్రీడలకు వైరాలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది, అలాంటిది రెండు రాష్ట్రాల స్థాయిలో వైరాలో నిర్వహించడం పట్ల క్రీడాకారులు సంతోషాన్ని తెలుపుతున్నారు. ఈ క్రీడల్లో గెలిచిన వారికి మొదటి బహుమతి 25016, రెండవ బహుమతి 20016, మూడవ బహుమతి 15016, నాలుగో బహుమతి 10016 రూపాయలను అందించనున్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈ నెంబర్లను 6309629444, 8309985366, 9966115826 సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.