Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా టౌన్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను వాడవాడలా తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్ పిఎస్) ఆద్వార్యంలో ఘనంగా నిర్వహించాలని, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం దళితులంతా ఏకమై ఉద్యమాలకు సన్నద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, సిపిఐ వైరా మండల కార్యదర్శి యామాల గోపాలరావు కోరారు. గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన ఖమ్మం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి వైరా మండల స్థాయి సమావేశంలో నూతన మండల సమితిని 12 మందితో ఎన్నుకున్నారు. దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్ పిఎస్) వైరా మండల నూతన అధ్యక్షులు నల్లగట్ల రవిందర్, కార్యదర్శి కోపెల మధు, కోశాధికారి రాయపుడి శ్రీనివాస్, సమితి సభ్యులు కొమ్ము చంటీ, పిడియాల శేషయ్య, పిడియాల లక్ష్మయ్య, అప్పం సుధాకర్, కంచర్ల కష్ణ, గుడిమళ్ళ రాయప్ప, ఇళ్ళారపు సైదులు, పూర్ణకంటి తిరుపతిరావులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ వైరా మండల కార్యదర్శి గారపాటి అశోక్, అప్పం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.