Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్ల బ్యాడ్జీలతో టీడీపీ నిరసన
నవతెలంగాణ-ఖమ్మం
కార్యకర్తలు రెక్కల కష్టంతో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కార్యకర్తలకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలుగు దేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం బైపాస్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు కూరపాటి ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్ లు మూతికి కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెక్కల కష్టంతో గెలిచిన ఎమ్మెల్యేలు వారి మనోభావాలను గౌరవించకుండా పార్టీ మారడం తగదన్నారు. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమం లో వల్లంకొండ వెంకటరామయ్య, కొండబాల కరుణాకర్, కేతినేని హరీష్, గుత్తా సీతయ్య, సానబోయిన శ్రీనివాసగౌడ్, నాగండ్ల మురళి, మేకల. సత్యవతి, నల్లమల రంజిత్,ఆకారపు శ్రీనివాస్, కాంపాటి. విజరు,వక్కంతుల వంశీ,పారిస్ వెంకన్న, వాసిరెడ్డి భాస్కరావు,వడ్డెమ్ విజరు, పాలడుగుకష్ణప్రసాద్ పాల్గొన్నారు.